దేశవ్యాప్తంగా రీజనల్ రూరల్ బ్యాంక్స్ (RRB) సంఖ్య తగ్గడంపై RBI మాజీ గవర్నర్ సి.రంగరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన RRBల విలీన ప్రక్రియను తప్పుడు నిర్ణయమని, ఇది స్థానిక బ్యాంకుల ప్రత్యేక స్వభావాన్ని దెబ్బతీస్తుందని చెన్నైలో జరిగిన ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వార్షికోత్సవంలో అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రుణాల పంపిణీ సమానంగా జరగాలనే ఉద్దేశంతోనే RRBలు ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. ప్రస్తుత సంస్కరణలు గ్రామీణ ఆర్థిక వేళ్లను కత్తిరిస్తున్నాయని అభిప్రాయపడ్డారు.