మెస్సీ మ్యాచ్‌.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

78చూసినవారు
మెస్సీ మ్యాచ్‌.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
మెస్సీ మ్యాచ్‌ సందర్భంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. వరంగల్ నుంచి ఉప్పల్ మీదుగా హైదరాబాద్, సికింద్రాబాద్ వెళ్లే వాహనాలు ఘట్‌కేసర్‌ ORR మీదుగా అబ్దుల్లాపూర్‌మెట్, LBనగర్, దిల్‌సుఖ్‌నగర్ మీదుగా వెళ్లాలని సూచించారు. అలాగే హైదరాబాద్ నుంచి ఉప్పల్ మీదుగా వరంగల్ వెళ్లేవారు LBనగర్, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ ORR మీదుగా వెళ్లాలని ఉప్పల్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ ఆంక్షలు మ్యాచ్‌ను వీక్షించడానికి వచ్చే అభిమానుల కోసం విధించారు.

సంబంధిత పోస్ట్