సోషల్ మీడియా దిగ్గజం మెటా కీలక నిర్ణయం తీసుకుంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్ వినియోగదారుల కోసం కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను ప్రకటించింది. ఇప్పటివరకు ఉచితంగా అందుబాటులో ఉన్న ఈ యాప్‌లలో ప్రీమియం ఫీచర్ల కోసం ఇకపై నెలవారీ ఛార్జీలు వసూలు చేయనుంది. ఇన్‌స్టాగ్రామ్ ప్లస్, ఫేస్‌బుక్ ప్లస్ ధర నెలకు 3.99 డాలర్లు (సుమారు రూ.387), వాట్సాప్ ప్లస్ ధర 2.99 డాలర్లు (సుమారు రూ.290)గా ఉండనుంది. దీంతో కస్టమ్ థీమ్‌లు, ప్రత్యేక స్టిక్కర్లు, అదనపు స్టోరీ ఫీచర్లు, యానిమేటెడ్ రియాక్షన్‌లు వంటి సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.