మరోసారి ఆగిపోయిన మెట్రో రైలు.. ప్ర‌యాణికుల ఆందోళన

15793చూసినవారు
మరోసారి ఆగిపోయిన మెట్రో రైలు.. ప్ర‌యాణికుల ఆందోళన
TG: హైదరాబాద్‌ మెట్రో రైలు నిర్వ‌హ‌ణ‌లో మ‌రోసారి సాంకేతిక లోపం త‌లెత్తింది. భరత్‌నగర్‌ మెట్రో స్టేషన్‌ పరిధిలో రైలు అకస్మాత్తుగా ఆగిపోయింది. దాదాపు 8 నిమిషాలపాటు రైలు కదలకపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే సమస్యను పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. మెట్రో అధికారులు ఈ ఘటనపై స్పందిస్తూ, చిన్న సాంకేతిక సమస్య కారణంగానే రైలు నిలిచిపోయిందని, త్వరగా పరిష్కరించి సర్వీసులు పునరుద్ధరించామని తెలిపారు.