మెక్సికోకు చెందిన ఫాతిమా బాష్ మిస్ యూనివర్స్-2025 కిరీటాన్ని గెలుచుకున్నారు. వందలాది మంది పోటీదారులను అధిగమించి, ఆమె ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. దాదాపు ఐదేళ్ల తర్వాత మెక్సికోకు ఈ కిరీటం దక్కడం విశేషం. డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజెర్ థెయిల్విగ్ ఆమెకు కిరీటాన్ని అందజేశారు. థాయిలాండ్‌కు చెందిన ప్రవీణార్ సింగ్ మొదటి రన్నరప్‌గా నిలిచారు. భారత్ తరపున మణిక విశ్వకర్మ పోటీపడ్డారు.