తెలంగాణలోని ప్రభుత్వ విద్యాసంస్థలను ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దుతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. గురువారం ఖమ్మం జిల్లా బోనకల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రానున్న విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని కల్పిస్తామని ప్రకటించారు. అలాగే రానున్న విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ విద్యార్థులకు కూడా ‘మధ్యాహ్న భోజనం’ పథకాన్ని ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు.