తెలంగాణ ప్రభుత్వ టీచర్లకు రాష్ట్ర కేబినెట్ శుభవార్త తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ-కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో పాటు విధులు నిర్వహించే ఉపాధ్యాయులు, లెక్చరర్లు, నాన్-టీచింగ్ సిబ్బందికి కూడా ఉచిత అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించనుంది. ప్రస్తుతం ఈ పథకాలు విద్యార్థులకు మాత్రమే అమలవుతుండగా, తాజా నిర్ణయంతో టీచర్లు, ఇతర సిబ్బందికీ విస్తరించనున్నారు. దీనివల్ల విద్యాసంస్థల్లో బోధనకు మరింత అనుకూల వాతావరణం ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.