అర్ధరాత్రి బిర్యానీ తింటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం!

0చూసినవారు
అర్ధరాత్రి బిర్యానీ తింటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం!
హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో 'అర్ధరాత్రి బిర్యానీ ట్రెండ్' కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నంలోనూ అర్ధరాత్రి తర్వాత బిర్యానీ ఆర్డర్లు 30-40% పెరుగుతున్నాయి. అర్ధరాత్రి మసాలాలు, గ్యాస్ ఉత్పత్తి చేసే పదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొలెస్ట్రాల్ పెరగడం, నిద్రలేమి వంటి అనేక రుగ్మతలు వస్తాయంటున్నారు. సాయంత్రం 7 గంటలలోపే డిన్నర్ పూర్తి చేయాలని, అర్ధరాత్రి అవసరమైతే మంచినీరు మాత్రమే తాగాలని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్