మరో 'ఫైట్' కు సిద్ధమైన మైక్ టైసన్

11739చూసినవారు
మరో 'ఫైట్' కు సిద్ధమైన మైక్ టైసన్
బాక్సింగ్ అభిమానులు కలలో కూడా ఊహించని ఒక అరుదైన పోరుకు రంగం సిద్ధమైంది. 'ఐరన్ మైక్' మైక్ టైసన్, 'మనీ' ఫ్లాయిడ్ మేవెదర్ జూనియర్ మధ్య భారీ ఎగ్జిబిషన్ మ్యాచ్ జరుగనున్నట్లు సీఎస్ఐ స్పోర్ట్స్ ధృవీకరించింది. 59 ఏళ్ల టైసన్ కెరీర్‌లో 50 విజయాలు (44 నాకౌట్లు), 48 ఏళ్ల మేవెదర్ 50 బౌట్లలో అజేయ రికార్డు సాధించారు. తేదీ, వేదిక త్వరలో వెల్లడించనున్నారు. ఈ పోరుపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.