మిలిటరీ దాడి.. 40 మంది మృతి!

101చూసినవారు
మిలిటరీ దాడి.. 40 మంది మృతి!
మయన్మార్ లో బౌద్ధ మత పండుగా సందర్భంగా వేడుకలు జరుపుకుంటుండగా అక్కడి మిలిటరీ ఓ గ్రామంపై బాంబులతో దాడి చేసింది. మిలిటరీ పారాగ్లైడర్ల సాయంతో బాంబులతో విరుచుకపడింది. ఈ ఘటనలో దాదాపు 40 మంది వరకు చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుల్లో యాంటీ మిలిటరీ దళ సభ్యులు సహా పిల్లలు, మహిళలూ ఉన్నారు. మరో 50 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. కాగా మయన్మార్ లో 2021 నుంచి సివిల్ వార్ కొనసాగుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you