గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టారి-వాఘా సరిహద్దులో వైభవంగా జరిగాయి. బీఎస్ఎఫ్ జవాన్లు నిర్వహించిన ‘బీటింగ్ రిట్రీట్’, కవాతు పర్యాటకులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ సందర్భంగా బీఎస్ఎఫ్, పాకిస్థాన్ రేంజర్స్ పరస్పరం స్వీట్లు పంచుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. 1959 నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఈ వేడుకను చూసేందుకు సుమారు 40వేల మంది పాల్గొన్నారు.