నేపాల్‌లో అవినీతి, సోషల్ మీడియా బ్యాన్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో 19 మంది మరణించిన సంగతి తెలిసిందే. యువత నిరసనకు దిగొచ్చిన కేపీ శర్మ ఓలీ తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. సైన్యం సూచన మేరకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నేపాల్‌లో సైనిక పాలన విధిస్తారా?, లేకుంటే కొత్త ప్రధానిని ఎన్నుకుంటారా? అనే దానిపై ఇవాళ సాయంత్రంలోగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.