నాసా వ్యోమగామి డాన్ పెటిట్ అంతరిక్షం నుంచి తీసిన అద్భుతమైన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇందులో పాలపుంత గెలాక్సీ, ప్రకాశవంతంగా కనిపిస్తున్న శుక్రగ్రహం, భూ వాతావరణంలోని ఎర్రటి కాంతి, కింద మెరుస్తున్న ఊదా రంగు మెరుపులు ఒకే ఫ్రేమ్‌లో దర్శనమిచ్చాయి. భూమి వాతావరణం, ఆకాశంలోని నక్షత్రాలు, తుఫాన్ల మెరుపులు కలిసిన ఈ దృశ్యం నెటిజన్లను ఆకట్టుకుంది. 'వావ్.. సూపర్' అంటూ నెట్టింట ప్రశంసలు కురిపిస్తున్నారు.