ఇంధనం లేక నిలిచిపోయిన మంత్రి హెలికాప్టర్ (వీడియో)

3777చూసినవారు
తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో సాంకేతిక సమస్య ఎదురైంది. బుధవారం ఆయన ప్రయాణించిన హెలికాప్టర్‌లో ఇంధనం ఖాళీ అవ్వడంతో తిరుగు ప్రయాణం రద్దయింది. దీంతో మంత్రి రోడ్డు మార్గాన హైదరాబాద్‌కు బయలుదేరారు. ఆదిలాబాద్‌లోని రిమ్స్ (RIMS) హాస్పిటల్‌లో జరిగిన అగ్నిప్రమాద బాధితులను పరామర్శించి, హైదరాబాద్ తిరిగి రావాల్సి ఉండగా, ఈ ఊహించని సంఘటన చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్