విద్యుత్ సమస్యలపై మంత్రిని ప్రశ్నిస్తే 'జై శ్రీరామ్' అని చెప్పి తప్పించుకున్నాడు. యూపీలో విద్యుత్ శాఖ మంత్రి ఏకే శర్మ గురువారం సుల్తాన్‌పూర్ నుండి జౌన్‌పూర్‌కు వెళ్తున్నారు. ఆయన వాహనాన్ని ఆపి జౌన్‌పూర్ వాసులు సమస్యలను వివరించారు. ఓ వ్యక్తి మాట్లాడుతూ ‘మా ఊరిలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకే కరెంట్ ఉంటోంది’ అని ప్రశ్నించాడు. దీంతో మంత్రి సమాధానం చెప్పకుండా దేవుడి ప్రస్తావన చేస్తూ వెళ్లిన వీడియో వైరల్ అవుతోంది.