మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో తాగునీటిలో డ్రైనేజీ నీరు కలవడం వల్ల 8 మంది మృతి చెంది, 162 మంది ఆసుపత్రి పాలైన ఘటనపై ఓ ఛానల్ రిపోర్టర్ ప్రశ్నించినప్పుడు రాష్ట్ర మంత్రి కైలాశ్ విజయవర్గీయ సహనం కోల్పోయి, 'ఉపయోగం లేని ప్రశ్నలు' చేయవద్దని అసహనం వ్యక్తం చేశారు. రిపోర్టర్ కూడా మంత్రికి గట్టిగా బదులివ్వడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, మంత్రి క్షమాపణలు చెప్పారు. తన ప్రజలు బాధపడుతున్న ఈ విషాద పరిస్థితుల్లో తన మాటల్లో తప్పులు దొర్లాయని విచారం వ్యక్తం చేశారు.