ఇందిరమ్మ ఇళ్లు, కొత్త పెన్షన్లపై శుభవార్త చెప్పిన మంత్రి

10చూసినవారు
ఇందిరమ్మ ఇళ్లు, కొత్త పెన్షన్లపై శుభవార్త చెప్పిన మంత్రి
TG: రాష్ట్రంలో ఇల్లు లేని అర్హులైన నిరుపేదలందరికీ సొంతింటి కల నెరవేరుస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మే నెలాఖరు నాటికి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను 'మన ఇసుక వాహనం' ద్వారా ఉచితంగా అందించేందుకు మైనింగ్ శాఖతో కలిసి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కొత్త పింఛన్లపై రాబోయే కేబినెట్ సమావేశంలో సీఎంతో చర్చించి త్వరితగతిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్