మేడారం జాతరకు దూరంగా మంత్రి కొండా సురేఖ!

108చూసినవారు
మేడారం జాతరకు దూరంగా మంత్రి కొండా సురేఖ!
TG: మేడారం మహా జాతరకు మంత్రి కొండా సురేఖ దూరంగా ఉంటున్నారు. జాతర తొలిరోజు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలకు చేరుకోగా.. వనదేవతలకు అధికారికంగా మంత్రి సీతక్క స్వాగతం పలికారు. మంత్రి పొంగులేటి సైతం కుటుంబసభ్యులతో కలిసి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అయితే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవానికి సంబంధిత శాఖ మంత్రి హాజరుకాకపోవడం గమనార్హం. మంత్రుల మధ్య ఇంకా విభేదాలు ఉన్న కారణంగానే హాజరు కానట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

సంబంధిత పోస్ట్