దిత్వా తుపాను కారణంగా శ్రీలంకలో చిక్కుకుపోయిన 25 మంది తెలుగు పర్యాటకులను స్వదేశానికి తరలించేందుకు మంత్రి లోకేశ్ చర్యలు చేపట్టారు. కొలంబో, చెన్నై అధికారులతో సమన్వయం చేసుకుని, అవసరమైన సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. తెనాలి, హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, విశాఖ ప్రాంతాలకు చెందిన ఈ పర్యాటకులు తమను భారత్‌కు తరలించాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌కు విజ్ఞప్తి చేశారు.