TG: క్యూర్ పరిధిలోని 22ఏ నిషేధిత భూములపై బుధవారం సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష జరిపారు. 22ఏ భూముల్లో ఎవరికీ అన్యాయం జరగదన్నారు. కొత్తగా ఒక్క సెంటు భూమిని కూడా నిషేధిత జాబితాలో చేర్చలేదని చెప్పారు. అర్హులైనవారి హక్కులు కాపాడుతూనే ప్రభుత్వ భూములు పరిరక్షించాలని అధికారులకు సూచించారు. 22ఏ దరఖాస్తులు, ఫిర్యాదులు నిర్ణీత గడువులోనే పరిష్కరించాలని, 22ఏ భూములకు సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.