తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. శివపార్వతులతో పాటు వారి కుమారులు ఉన్న చిత్రపటాన్ని ప్రదర్శించారు. ఎంత వైరుధ్యం ఉన్నా, ఎన్ని అంశాలు ఉన్నా శివుడి కుటుంబంలా మనమంతా కలిసిమెలిసి ఉండాలని అసెంబ్లీలో మంత్రి సూచించారు. శివుని కుటుంబంలోనే ఎన్నో వైరుధ్యాలు ఉంటాయని, నెమలికి పాముకు పడదు, ఆవుకు సింహానికి పడదు.. కానీ వారంతా కలిసి ఒక పరివారంగా ఉంటారన్నారు.