విద్వేష ప్రసంగాల నివారణ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్

5చూసినవారు
విద్వేష ప్రసంగాల నివారణ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్
TG: విద్వేష ప్రసంగాలు, విద్వేష నేరాల నివారణ బిల్లు-2026ను మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సోషల్ మీడియాలో కులమతాలను నిందిస్తూ, మనోభావాలను దెబ్బతీసేలా ప్రసంగాలు, పోస్టుల ద్వారా జరిగే విధ్వంసాలను అరికట్టేందుకు ఈ బిల్లును తీసుకొచ్చినట్లు మంత్రి తెలిపారు. నిందితులకు కఠిన శిక్షలు, బాధితులకు న్యాయం జరిగేలా పలు అంశాలను ఈ బిల్లులో పొందుపరిచామన్నారు. నేరస్థులకు 1 నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ.50 వేల వరకు జరిమానా విధించే నిబంధనలు ఇందులో ఉన్నాయన్నారు.

ట్యాగ్స్ :