హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణపై మంత్రి పొన్నం సమీక్ష

32చూసినవారు
హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణపై మంత్రి పొన్నం సమీక్ష
TG: హైదరాబాద్‌ నగరంలో ఎలక్ట్రిక్‌ బస్సుల నిర్వహణపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. కాలుష్య రహిత రవాణా సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. ఇప్పటికే ఈవీ పాలసీ ద్వారా ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం, PM e-Drive పథకం కింద హైదరాబాద్‌కు 2,000 ఎలక్ట్రిక్‌ బస్సులను కేటాయించింది. ఈ పథకం అమలులో భాగంగా e-బస్సుల ఆపరేషన్లు సజావుగా సాగేందుకు కంపెనీ ప్రతినిధులతో మంత్రి సమీక్ష జరిపారు.

సంబంధిత పోస్ట్