TG: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఉమ్మడి వరంగల్ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారా? అన్న చర్చ జరుగుతోంది. కొండా సురేఖ బర్తరఫ్ తర్వాత సీతక్క ఒక్కరే ఉమ్మడి జిల్లా నుంచి మంత్రిగా ఉన్నారు. ఇప్పటివరకు ములుగు జిల్లా అభివృద్ధిపైనే దృష్టి సారిస్తూ వస్తున్న మంత్రి.. శుక్రవారం తొలిసారిగా ఉమ్మడి KMMతోపాటు WGL జిల్లాల అధికారులతో హనుమకొండ IDOC వేదికగా సమీక్ష నిర్వహించడం ఆసక్తికరంగా మారింది. అయితే సమీక్షతోనే ఈ ప్రక్రియ ముగుస్తుందా? లేక ఇకపై వరుస సమీక్షలు కొనసాగుతాయా? అన్న చర్చ మొదలైంది. ఉమ్మడి జిల్లా వ్యవహారాల్లో మరింత చురుగ్గా వ్యవహరించే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.