TG: రాష్ట్ర మంత్రి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఇంఛార్జి దనసరి అనసూయ (సీతక్క) బుధవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొననున్నారు. కలెక్టర్ ఆడిటోరియంను సందర్శించి, ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.