పొంగులేటిపై మంత్రి సురేఖ సీరియస్!

51చూసినవారు
పొంగులేటిపై మంత్రి సురేఖ సీరియస్!
TG: మేడారం టెండర్లలో ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జోక్యం చేసుకుంటున్నారని మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దేవాదాయ శాఖకు సంబంధించిన రూ.71 కోట్ల పనుల టెండర్ తనకు తెలియకుండానే రావడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ విషయమై సురేఖ ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అలాగే ఢిల్లీ వెళ్లి ఖర్గేను కలవనున్నారు. మరోవైపు కొండా మురళి సీఎం రేవంత్ అపాయింట్‌మెంట్‌ను కోరారు.

సంబంధిత పోస్ట్