కేంద్రమంత్రులను కలిసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

5చూసినవారు
కేంద్రమంత్రులను కలిసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఢిల్లీలో బుధవారం పలువురు కేంద్రమంత్రులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిశారు. కేంద్ర వ్యవసాయశాఖమంత్రి శివరాజ్‌సింగ్‌ను కలిసిన మంత్రి.. ఆయిల్‌పామ్‌కు కనీస మద్దతు ధర రూ.25 వేలు నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సహాయమంత్రి పెమ్మసానితో తుమ్మల భేటీ అయ్యారు. కొత్తగూడెంలో ప్రాంతీయ కొబ్బరి అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రాంతీయ ఆయిల్‌పామ్‌ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. పీఎం-ఆర్‌కేవీవై కింద తెలంగాణకు కేటాయింపులు పెంచాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్