TG: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి చెరువులో SDRF సిబ్బంది గల్లంతైన ఘటనపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యవేక్షిస్తున్నారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు అధికారులు అక్కడే ఉండాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ పరంగా ఏ సహాయం కావాలన్న వెంటనే సమాచారమివ్వాలని, ఆచూకీ తెలియని వారి ఫోన్ నంబర్ల కోసం అత్యాధునిక టెక్నాలజీ వాడాలని ఆదేశించారు. చిక్కుకున్న జాలర్లతో మంత్రి ఫోన్లో మాట్లాడారు.