TG: నీటి పారుదల ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. డిండి, అచ్చంపేట సాగు నీటి ప్రాజెక్టుల పురోగతిపై సచివాలయంలో సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల పనులు, భూసేకరణ, పునరావాస ప్రక్రియపై అధికారులతో చర్చించారు. పెండింగ్ పనులు, క్షేత్రస్థాయి సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్న ఉత్తమ్, నిర్దేశిత గడువులో పనులు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ప్రాజెక్టుల అమలులో ఎదురవుతున్న అడ్డంకులను సత్వరమే పరిష్కరించాలని స్పష్టం చేశారు.