
ఇరాన్ చర్చలకు సిద్ధంగా ఉంది: అమెరికా
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్ తన అణు కార్యక్రమానికి సంబంధించిన కొన్ని అంశాలపై చర్చలకు సిద్ధంగా ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న పశ్చిమాసియా సైనిక చర్యలపై నిర్వహించిన సెనేట్ విచారణలో రూబియో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణ్వాయుధాల అభివృద్ధి కోసం భారీ స్థాయిలో సంప్రదాయ సైనిక సామర్థ్యాలను పెంచుకునే ప్రయత్నం చేసిందని, అయితే అమెరికా, మిత్రదేశాల చర్యలతో ఆ రక్షణ వ్యవస్థ దెబ్బతిన్నదని ఆయన ఆరోపించారు.




