రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

12865చూసినవారు
రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తామని తెలంగాణ కాంగ్రెస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. రేషన్ కార్డుల జారీపై ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం 90 లక్షల కార్డులు ఉండగా, 2 కోట్ల 80 వేల మంది లబ్ధిదారులు ఉన్నట్లు చెప్పారు. రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తి కాగానే ప్రతీ వ్యక్తికి 6 కిలోలు.. అది కూడా సన్నబియ్యం ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్