రేవంత్ రెడ్డి 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం.. అభినందించిన మంత్రులు

0చూసినవారు
రేవంత్ రెడ్డి 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం.. అభినందించిన మంత్రులు
TG: సీఎం రేవంత్ రెడ్డి తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. మిడ్జిల్ మండలం జడ్పీటీసీగా ప్రారంభమైన ఆయన ప్రయాణం రాష్ట్ర అత్యున్నత పదవి వరకు సాగింది. ఈ సందర్భంగా మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తన ప్రస్థానంపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ, ఇది తన జీవితంలో ఒక ప్రత్యేక అధ్యాయమని, ప్రజలతో విడదీయలేని అనుబంధం కలిగి ఉన్నట్లు తెలిపారు. గత 20 ఏళ్లుగా ప్రజలే కేంద్ర బిందువుగా తన రాజకీయ ప్రయాణం కొనసాగుతోందని, ఈ సుదీర్ఘ ప్రయాణంలో తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్