TG: ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్‌ను ప్రారంభించిన సందర్భంగా శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు మెట్రోలో ప్రయాణించారు. ఈ క్రమంలో బేగంపేట మెట్రో స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఎస్కలేటర్ హఠాత్తుగా మధ్యలోనే ఆగిపోయింది. దీంతో మంత్రులకు పెను ప్రమాదం తప్పింది. ఎస్కలేటర్ పనిచేయకపోవడంతో మంత్రులు నడుచుకుంటూ ప్లాట్‌ఫామ్‌పైకి చేరుకుని, అనంతరం వారు మెట్రో రైలులో ప్రయాణికులతో ముచ్చటించారు.