సీఎంఆర్ఎఫ్ అమలులో మంత్రుల ‘పవర్స్ కట్’

5చూసినవారు
సీఎంఆర్ఎఫ్ అమలులో మంత్రుల ‘పవర్స్ కట్’
TG: సీఎంఆర్ఎఫ్ అమలులో మంత్రుల అధికారాలను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు మంత్రులు ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాల ప్రజలకు CMRF సిఫార్సులు ఇచ్చేవారు. కానీ.. ఇక నుంచి వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికే సిఫార్సులు చేయాలని నిర్ణయించింది. దరఖాస్తులను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే స్వీకరించనున్నారు. దరఖాస్తుదారు తమ వివరాలు, అవసరమైన పత్రాలు అప్‌లోడ్ చేయాలి. చెక్కుల జారీ, రీవాలిడేషన్ ప్రక్రియ సైతం ఆన్‌లైన్లోనే జరగనుంది. అందుకోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రభుత్వం ప్రారంభించింది.

ట్యాగ్స్ :