మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న మంత్రులు

3చూసినవారు
మేడారం మహాజాతర ఈ నెల 28 నుండి మూడు రోజుల పాటు ప్రారంభం కానుంది. జాతర ముందే భక్తుల తాకిడి మొదలైంది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుండి భక్తులు అమ్మవార్లను దర్శించుకునేందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ మేడారం చేరుకుని అభివృద్ధి పనులను పరిశీలించారు. వారికి మంత్రి సీతక్క, అధికారులు స్వాగతం పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్