మైనర్‌పై రెండుసార్లు అత్యాచారం.. నిందితుడికి 51 ఏళ్లపాటు జైలు శిక్ష

103చూసినవారు
మైనర్‌పై రెండుసార్లు అత్యాచారం.. నిందితుడికి 51 ఏళ్లపాటు జైలు శిక్ష
TG: నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలో మైనర్ బాలికపై రెండుసార్లు అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి కఠిన శిక్ష పడింది. 2021లో పోక్సో చట్టం కింద శిక్ష పడి బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత, అదే బాలికను అపహరించి, నిర్బంధించి మరోసారి అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. విచారణలో కీలక సాక్ష్యాధారాలు సమర్పించిన ప్రాసిక్యూషన్ వాదనల ఆధారంగా కోర్టు మొదటి కేసులో 51 ఏళ్ల జైలు శిక్ష, రెండో కేసులో జీవిత ఖైదు విధించింది. రెండు శిక్షలను ఏకకాలంలో అమలు చేయాలని ఆదేశించింది.

సంబంధిత పోస్ట్