
ఏపీలో వేసవి సెలవులు మరో ఐదు రోజుల పాటు పొడిగింపు
AP: విద్యాశాఖ విద్యార్థుల సౌలభ్యం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలల పునఃప్రారంభాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. ముందుగా నిర్ణయించిన జూన్ 1వ తేదీకి బదులుగా.. జూన్ 5వ తేదీ వరకు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నందున, విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా వేసవి సెలవులను మరో ఐదు రోజులు పొడిగించారు. దీంతో జూన్ 6వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించాలని ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి రంజిత్ బాషా ఆదేశాలు జారీ చేశారు.




