
హైదరాబాద్లో మారథాన్.. ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్లో ఆగస్టు 30న జరిగే మారథాన్ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ మళ్లింపులు, రద్దీపై అడ్వైజరీ జారీ చేశారు. ఆదివారం ఉదయం 4:00 నుండి 11:30 వరకు సైబరాబాద్ పరిధిలో 'హైదరాబాద్ మారథాన్' సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈ మారథాన్ పీపుల్స్ ప్లాజా, కేబుల్ బ్రిడ్జి, ఐకియా, బయోడైవర్సిటీ మీదుగా గచ్చిబౌలి స్టేడియం వరకు సాగుతుంది. షేక్పేట్, లింగంపల్లి, కొండాపూర్, సైబర్ టవర్స్, మియాపూర్, ఐఐఐటీ వైపు వెళ్లే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించనున్నారు.




