TG: హైదరాబాద్ నగరంలోని మీర్‌చౌక్ ఏసీపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపాయి. ఏసీపీ శ్యామ్ సుందర్ వేధిస్తున్నారంటూ దళిత మహిళ మీర్‌చౌక్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోన్‌లో అసభ్యకర మెసేజ్‌లు పంపుతున్నారని, ఒంటరిగా రావాలని వేధిస్తున్నారని మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓ కేసు విషయంలో న్యాయం చేయాలని ఏసీపీని కలిశానని ఆమె చెప్పారు. అప్పటి నుంచి కేసు అడ్డు పెట్టుకుని వేధిస్తున్నారంటూ మహిళ ఆరోపించారు.