తెలంగాణలో బతుకమ్మ సంబురాల్లో ప్రపంచ సుందరి ఓపల్ సుచాత చువాంగ్ సందడి చేశారు. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన వేడుకల్లో మహిళలు, చిన్నారులతో కలిసి బతుకమ్మ ఆడారు. బ్రెస్ట్ కాన్సర్ అవగాహన కార్యక్రమానికి నగరానికి వచ్చిన ఆమె, బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ప్రభుత్వ నిర్వహణలోని ఇతర కార్యక్రమాల్లోనూ ఆమె పాల్గొనే అవకాశం ఉంది.