కీవ్‌పై మిస్సైళ్లు, డ్రోన్ల‌తో దాడి.. 9 మంది మృతి

9598చూసినవారు
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో శనివారం ఉదయం రష్యా భీకర దాడి చేసింది. ఈ దాడిలో 9 మంది మరణించగా, 22 మంది గాయపడ్డారు. సోలోమియానెస్కీ జిల్లాలో 5 అంతస్తుల నివాస భవనం దెబ్బతింది, అందులోని 35 మందిని తరలించారు. డర్నిట్స్కీ జిల్లాలో జరిగిన దాడిలో ఏడుగురు మృతిచెందగా, 14 మంది గాయపడ్డారు. ఇళ్లు కూలి మంటలు వ్యాపించాయి. కీవ్ సమీపంలోని సైనిక పారిశ్రామిక కేంద్రాలు, లాజిస్టిక్ హబ్‌లను లక్ష్యంగా చేసుకున్నట్లు రష్యా పేర్కొంది.

సంబంధిత పోస్ట్