TG: సీఎం రేవంత్ రెడ్డికి
బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్ బహిరంగ సవాల్ విసిరారు. శనివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి అల్లుడు గొలుగూరి సత్యనారాయణ రెడ్డి ఆస్తులు, కంపెనీలపై తాను వెల్లడించిన వివరాలు తప్పని నిరూపించాలని క్రిశాంక్ డిమాండ్ చేశారు. తాను చెప్పిన వివరాలు తప్పు అని నిరూపిస్తే ఇకపై ఎప్పుడూ ప్రెస్‌మీట్ పెట్టనని, తప్పు అని తేలితే రేవంత్ రెడ్డి కుటుంబానికి బహిరంగంగా క్షమాపణలు చెబుతానని క్రిశాంక్ పేర్కొన్నారు. ఈ సవాల్‌కు మీరు సిద్ధమా అని ఆయన ప్రశ్నించారు.