ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతారా నియోజకవర్గ ఎమ్మెల్యే,
బీజేపీ నేత దీపేశ్ సాహు, ముఖ్యమంత్రి కన్యా వివాహ యోజన కింద నిర్వహించిన సామూహిక వివాహ కార్యక్రమంలో తరుణా సాహును అనే యువతిని వివాహం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో 20కి పైగా జంటలతో కలిసి ఎమ్మెల్యే పెళ్లి చేసుకోవడం అందరినీ ఆకట్టుకుంది. వివాహానికి ముందు ఎమ్మెల్యేను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అరుణ్ సావో ఎడ్లబండిపై ఊరేగించారు. ఎమ్మెల్యే నిరాడంబరతను ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ అభినందించారు.