ఎమ్మెల్యే కనాతిల్ జమీలా కన్నుమూత

86చూసినవారు
ఎమ్మెల్యే కనాతిల్ జమీలా కన్నుమూత
కేరళలోని కోయిలాండి ఎమ్మెల్యే కనాతిల్ జమీలా (59) క్యాన్సర్‌తో పోరాడుతూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. గత ఆరు నెలలుగా ఆమె చికిత్స తీసుకుంటున్నారు. 2005లో చెలన్నూర్ బ్లాక్ పంచాయతీ అధ్యక్షురాలిగా, 2010, 2020లో కోజికోడ్ జిల్లా పంచాయతీ అధ్యక్షురాలిగా పనిచేశారు. 2021లో కోయిలాండి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్థి ఎన్. సుబ్రమణియన్‌ను 8472 ఓట్ల తేడాతో ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టారు.
Job Suitcase

Jobs near you