బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంపై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. శుక్రవారం సాయంత్రం సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలో, సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్బలంతో తనపై, తన కుటుంబంపై రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడ్డారని, సమ్మక్క జాతరకు వెళ్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకొని ఒత్తిడికి గురి చేశారని, ఆ ఫ్రస్ట్రేషన్‌లో తెలియకుండా నోరు జారాను తప్ప ఉద్దేశపూర్వకంగా కాదని వివరణ ఇచ్చారు.