కేరళలోని పాలక్కాడ్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్యే రాహుల్ మమ్‌కూతతిల్ శనివారం అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పతనంతిట్ట జిల్లాకు చెందిన ఓ మహిళ ఇచ్చిన అత్యాచార ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నారు. పెళ్లి పేరుతో మోసం, బలవంతపు గర్భస్రావం వంటి తీవ్ర ఆరోపణలను బాధితురాలు చేసింది. గత రెండు అత్యాచార కేసుల్లో రాహుల్కు కోర్టుల నుంచి ముందస్తు బెయిల్ లభించింది.