TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో శుక్రవారం బీఆర్‌ఎస్ బలపరిచిన కోయగూడెం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి పూనెం కరుణాకర్‌పై ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తమ్ముడు కోరం సురేందర్, కోరం ఉమ దాడికి పాల్పడ్డారు. నామినేషన్ వేయవద్దని బెదిరించి, వార్డు సభ్యులను కూడా పోటీ చేయవద్దని బెదిరించినట్లు బాధితులు తెలిపారు. ఈ ఘటనపై పూనెం కరుణాకర్, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఆందోళన వ్యక్తం చేస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.