నిధులు కేటాయించండి.. మంత్రి కోమటిరెడ్డిని కోరిన ఎమ్మెల్యే సంజయ్

25చూసినవారు
నిధులు కేటాయించండి.. మంత్రి కోమటిరెడ్డిని కోరిన ఎమ్మెల్యే సంజయ్
జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గంలో దెబ్బతిన్న వంతెనలు, అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్లు, పునరుద్ధరించాల్సిన రోడ్ల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సానుకూలంగా స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్