టికెట్‌ ఇవ్వాలంటూ సీఎం ఇంటిముందు ధర్నాకు దిగిన ఎమ్మెల్యే

81చూసినవారు
టికెట్‌ ఇవ్వాలంటూ సీఎం ఇంటిముందు ధర్నాకు దిగిన ఎమ్మెల్యే
బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కోలాహలం నెలకొంది. అధికార కూటమిలోని జేడీయూ కూడా ఇంకా అభ్యర్థుల జాబితాను ప్రకటించినప్పటికీ.. పొత్తులో భాగంగా తన సిట్టింగ్‌ స్థానమైన గోపాల్‌పూర్‌ను బీజేపీకి వదిలేసింది. దీంతో గోపాల్‌పూర్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జేడీయూ ఎమ్మెల్యే గోపాల్‌ మండల్ మంగళవారం ఉదయం సీఎం నితీశ్ కుమార్ కలవాలని ప్రయత్నించారు. అప్పాయింట్‌మెంట్ లేకపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతించలేదు. దీంతో టికెట్‌ ఇవ్వాలంటూ సీఎం ఇంటి ఎదుటే ధర్నాకు దిగారు.

సంబంధిత పోస్ట్