బెంగళూరు సదాశివనగర్‌లో
బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న ఓ ఇంటి వెనుక బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తుండగా ఓ యువకుడు అడ్డుకున్నాడు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. 'నన్ను అడగడానికి నువ్వెవరు?' అంటూ ఎమ్మెల్యే తన తల్లిని బూతులు తిట్టారని యువకుడు ఆరోపించాడు. కాసేపటికి పోలీసులు అక్కడికి చేరుకొని వారికి నచ్చజెప్పారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.